Oct 02,2023 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రికి గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌భవన్‌లో గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు గవర్నరు నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు సిఎం సోమవారం పుష్పాంజలితో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, జై జవాన్‌, జై కిసాన్‌ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉందని సిఎం జగన్‌ 'ఎక్స్‌'లో గుర్తుచేశారు.