చెన్నై : బిచ్చగాడు మూవీ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొంది. విజయ్ కుమార్తె మీరా ఆంటోని (16) మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆంటోని 12వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా ఈమె ఒత్తిడితో ఉన్నారని సమాచారం. చెన్నైలోని డిడికె రోడ్‌లో ఉన్న తన ఇంట్లో ఈరోజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు విజయ్ ఆంటోనికి ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. మీరా ఆంటోని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.










