Oct 06,2023 12:36

అమరావతి : '' రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ... 'కాంతితో క్రాంతి' నిరసన కార్యక్రమానికి టిడిపి పిలుపునిచ్చిన విషయం విదితమే. దీనిపై బ్రాహ్మణి శుక్రవారం ట్వీట్‌ చేశారు.

'' మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి ? అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాలపాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం '' అని బ్రాహ్మణి ట్వీట్‌లో పేర్కొన్నారు.