Oct 14,2023 09:47

అమరావతి : అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. శనివారం గన్నవరం నుండి నేరుగా రాజమండ్రికి లోకేశ్‌ బయలుదేరారు. చంద్రబాబును ములాఖత్‌ ద్వారా కలిసేందుకు ఆయన కుటుంబీకులు జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ మాట్లాడుతూ ... టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని అన్నారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ రిమాండ్‌లోనే ఆయనను ఉంచాలనే కుట్ర చేస్తున్నారని, భద్రత లేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పూ చేయని ఆయన పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.