Sep 25,2023 10:14

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సోమవారం శాసనసభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, ఏపీపీఎస్సీ అదనపు విధుల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మహిళా సాధికారతపై ఎపి అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.