రామభద్రపురం (విజయనగరం) : మద్యం మత్తులో కన్నతల్లిని కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున రామభద్రపురంలో జరిగింది. రామభద్రపురం మండల కేంద్రం పెద్దింటి వీధిలో నివసిస్తున్న ఉప్పల రవనమ్మ (75)తో ఆమె సొంత కుమారుడు శ్రీను ఈరోజు తెల్లవారుజామున వాదులాటకు దిగాడు. మద్యం మత్తులో తల్లితో వాదులాడుతూ ఆమె తలపై బలమైన సాధనంతో కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుండి శ్రీను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి లంగిపోయాడు. అయితే ఈరోజు జిల్లాలో ఏర్పాటు చేసిన సిఎం సభకు బందోబస్తుగా ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది వెళ్ళడంతో అక్కడున్న ఎఎస్‌ఐ చిన్నారావు, బాడంగి ఎస్‌ఐ జయంతి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి నేరపరిశోధన చేస్తున్నారు. పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో చెబుతామని సిఐ అన్నారు.










