హనుమంతునిపాడు (ప్రకాశం) : ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తించాలని, రూ.పదివేల కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ .... సెప్టెంబర్ 10 తేదీన ప్రారంభమైన సిపిఎం పోరుబాట పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. శుక్రవారం హనుమంతునిపాడు మండలంలో నిర్విరామంగా పాదయాత్ర కొనసాగుతోంది. హనుమంతునిపాడులోని రోడ్డు నిర్మాణ కార్మికులతో పాదయాత్ర బఅందం మాట్లాడింది. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.










