అమరావతి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కొరటాల సత్యనారాయణ జీవితం నేటి తరానికి ఆదర్శమని కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతాంగ , చేనేత, కౌలు రైతు ఉద్యమ నిర్మాత , సిపిఎం మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ శత జయంతి సభను వడ్డేశ్వరంలోని కొరటాల బాపనయ్య భవనం (కె బి భవనం)లో నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు నివాళులు అర్పించారు. కొరటాల ప్రజా ఉద్యమాలు చేస్తూనే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేశారన్నారు . రెండుసార్లు శాసనసభ సభ్యులుగా పని చేశారని గుర్తు చేశారు. రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు..










