Sep 29,2023 11:38

అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ఎలైన్‌మెంట్‌ కేసుకు సంబంధించి ... టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం విచారణ ముగిసింది. సిఆర్‌పిసి 41 ఏ ప్రకారం ... నోటీసులిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) కోర్టుకు తెలిపారు. ఏజీ ఇచ్చిన మరికొన్ని వివరాలను కూడా హైకోర్టు నమోదు చేసుకుంది. అనంతరం లోకేశ్‌ తరఫు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. న్యాయమూర్తి మాట్లాడుతూ ... అరెస్టు గురించి ఆందోళన లేకపోవడంతో ఇక విచారణ ముగుస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే లోకేశ్‌ పేరును చేరుస్తూ ఎసిబి కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసిన సంగతి విదితమే.