Sep 26,2023 11:35

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంపై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై సభ్యులు చర్చించనున్నారు. విద్యారంగంపైనా చర్చ జరగనుంది. అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌ కొనసాగింది. ఉదయం 10 గంటల 6 నిముషాలకు సిఎం జగన్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర సమగ్ర శిక్ష, కస్తూరిబా విద్యాలయాలలోని కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై వాయిదా తీర్మానాన్ని పిడిఎఫ్‌ సభ్యులు ఇచ్చారు. ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ తిరస్కరించారు.