హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో భాగంగా ... కెసి వేణుగోపాల్ ఆదివారం ఉదయం 55 మంది అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు సీటు దక్కింది. భద్రాచలంలో సిపిఎం అభ్యర్ధిగా పోదాం వీరయ్య బరిలో దిగనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన వేములకు నకిరేకల్ సీటు దక్కింది. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికీ సీట్లు ఇచ్చారు. ఈ జాబితాలో 11 మంది ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్దులున్నారు. ఉన్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం, ఖమ్మం, పాలేరు నియోజవర్గాలకు ఇంకా పేర్లు ఖరారు కాలేదు.












