Sep 24,2023 15:28

నస్‌పూర్‌: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సమీపంలో 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపూర్‌ జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో.. పోలీసులు ట్రాక్టర్‌ను తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు నిర్ధరించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.