Sep 22,2023 08:36

భీమడోలు (ఏలూరు) : లారీని బైక్‌ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఏలూరు జిల్లా భీమడోలు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు ... పూళ్ళ కి చెందిన ఇద్దరు యువకులు బైక్‌ పై భీమడోలు వైపు వెళుతుండగా, భీమడోలు మండలం పూల్ల - కురెళ్లగుడెం మధ్యలో ముందుగా వెళుతున్న లారీని ఢకొీట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న పన్నా.ఈశ్వర మనికుమార్‌ (17) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి భీమడోలు పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన యువకుడు తాడేపల్లిగూడెం ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తమ మిత్రుడు మృతికి సంతాపంగా కళాశాల విద్యార్థులు కాలేజీకి సెలవు తీసుకున్నారు. తీవ్రగాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.