న్యూఢిల్లీ : నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి పై సుప్రీం కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. బుధవారం విచారణ చేపట్టేందుకు అనుమతినిచ్చారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి తెలుస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ... చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.










