Sep 25,2023 08:55

తాడిపత్రి (అనంతపురం) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పెద్దపప్పూరు మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపానికి భూమి పూజ చేసేందుకు జేసీ సిద్ధమయ్యారు. అయితే దానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. జేసీ ప్రభాకర్‌ ఇంటి వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.