Oct 16,2023 12:20

ముథోల్‌ (బాసర) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీం కోర్టు మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం దర్శించుకున్నారు. తన మనవరాలు నిత్యశ్రీకి అక్షరాభ్యాసం చేశారు. ఆలయానికి విచ్చేసిన జస్టిస్‌కు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి దేవికి కుంకుమార్చన, మహాహారతితోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మనవరాలు నిత్యశ్రీకి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ఈవో విజయరామారావు, ఛైర్మన్‌ శరత్‌ సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.