- రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృధా
- గుజరాత్‌పై ముంబయి ఇండియన్స్ 28 పరుగుల తేడాతో గెలుపు
ముంబయి : ఐపిఎల్ సీజన్-16లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో మెరవడంతో ముంబయి ఇండియన్స్ 28 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. తొలి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 218పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేసింది. ఈ గెలుపుతో ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకి ప్లే-ఆఫ్‌కు చేరువైంది. వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి సూర్యకుమార్ యాదవ్(103నాటౌట్) అజేయ శతకంతో రాణించడంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 218పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. సూర్యకుమార్ షాట్ కొడితే... బంతి వెళ్లి బౌండరీ దాటడం పరిపాటిగా మారింది. టాస్ గెలిచిన గుజరాత్... ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. సూర్య 49 బంతుల్లో 11ఫోర్లు, 6భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ముందు సూర్య వ్యక్తిగత స్కోరు 97 పరుగులు కాగా... ఓ సిక్స్‌తో సెంచరీ అందుకున్న తీరు ''వాV్‌ా సూర్యా వాV్‌ా'' అనిపించింది. ఈ సీజన్‌లో సూర్యకుమార్ ఇదే తొలి సెంచరీ. ఇషాన్ కిషన్ 31, కెప్టెన్ రోహిత్ శర్మ 29, నేహాల్ వధేరా 15, విష్ణు వినోద్ 30 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్‌కు నాలుగు, మోహి త్ శర్మకు ఒక వికెట్ దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజరు శంకర్ (29), డేవిడ్ మిల్లర్(41)కి తోడు చివర్లో రషీద్‌ఖాన్ (79నాటౌట్; 32బంతుల్లో 3ఫోర్లు, 10సిక్సర్లు) మెరుపులు తోడైనా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మథ్వల్‌కు మూడు, చావ్లా, కార్తికేయకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్‌బి) రషీద్ ఖాన్ 31, రోహిత్ (సి)తెవాటియా (బి)రషీద్ ఖాన్ 29, సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 103, వధేరా (బి)రషీద్ ఖాన్ 15, విష్ణు వినోద్ (సి)మనోహర్ (బి)మోహిత్ శర్మ 30, టిమ్ డేవిడ్ (సి అండ్ బి)రషీద్ ఖాన్ 5, గ్రీన్ (నాటౌట్) 3, అదనం 2. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 218పరుగులు. బౌలింగ్: షమీ 4-0- 53-0, మోహిత్ 4-0-43-1, రషీద్‌్ 4-0-30-4, నూర్ 4-0-38-0, జోసెఫ్ 4-0-52-0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : సాహా (ఎల్‌బి)మధ్వాల్ 2, శుభ్‌మన్ (బి)మధ్వాల్ 6, హార్దిక్ (సి)ఇషాన్ (బి)బెహ్రెన్‌డార్ఫ్ 4, విజయ్ శంకర్ (బి)చావ్లా 29, డేవిడ్ మిల్లర్ (ఎల్‌బి) మధ్వాల్ 41, మనోహర్ (బి)కార్తికేయ 2, తెవాటియా (సి)గ్రీన్ (బి)చావ్లా 14, రషీద్ ఖాన్(79నాటౌట్), నూర్ అహ్మద్ (బి)కార్తికేయ 1, జోసెఫ్ (నాటౌట్) 7, అదనం 6. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 191పరుగులు. బౌలింగ్: బెహ్రె న్‌డార్ఫ్ 4-0-37-1, మధ్వాల్ 4-0-31-3, జోర్డాన్ 4-0-34-0, పియూష్ చావ్లా 4-0- 36-2, కార్తికేయ 3-0-37-2, గ్రీన్ 1-0-13-0.












