Jun 29,2023 12:39

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్‌ పలు రికార్డులను బ్రేక్‌ చేశాడు. తొలి రోజు ఆటలో స్మిత్‌ ప్రస్తుతం 85 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు వ్యక్తిగత స్కోరు 32 పరుగులకు చేరుకోగానే స్మిత్‌ టెస్టులలో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టులలో వేగవంతంగా ఈ ఘనత సాధించినవారిలో స్మిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. 9వేల పరుగులు చేయడానికి స్మిత్‌కు 174 ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయి. స్మిత్‌ కంటే ముందు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. 172 ఇన్నింగ్స్‌లలోనే 9వేల పరుగల మార్కును అందుకున్నాడు.
సంగక్కర, స్మిత్‌ తర్వాత టీమిండియా దిగ్గజం ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ 176 ఇన్నింగ్స్‌లలో, విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా177 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా లెజెంరీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌.. 177 ఇన్నింగ్స్‌ లలో 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దెనే 178 ఇన్నింగ్స్‌లలో, సచిన్‌ టెండూల్కర్‌ 179 ఇన్నింగ్స్‌లో 9వేల పరుగుల మార్కును అందుకున్నారు.