Sep 13,2023 15:41

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక బంగాళాఖాతం మధ్య భాగంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మాన్‌సూన్‌లో అల్పపీడనం ఏర్పడటం సాధారణం. దీంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.