Sep 25,2023 20:05

ప్రజాశక్తి - తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొని తిరుమాడ వీధులలో స్వామివారి రథాన్ని లాగారు. ఈ ఉత్సవంలో ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టిటిడి చైైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఇఒ ఎవి ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఇఒలు పాల్గొన్నారు.