Sep 24,2023 21:23

ప్రజాశక్తి- తిరుమల:శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారిని సూర్యప్రభ వాహనంపై రామకఅష్ణ గోవింద అలంకారంలో శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో ఊరేగించారు. రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఇఒ ఎవి ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డుసభ్యులు సీతారెడ్డి, అశ్వర్థనాయక్‌, సుబ్బరాజు, శేషుబాబు, జెఇఒలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ నరసింహ కిషోర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.