విజయవాడ : దసరా పండుగ వేళ ... రైల్వే స్టేషన్లన్నీ జనాలతో కిక్కిరిశాయి. ఈ నేపథ్యంలో ... రైల్వే అధికారులు ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా పలు రైళ్ల సర్వీసులను ప్రత్యేకంగా అందిస్తున్నారు. కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు (07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 20, 27 తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి ప్రత్యేక రైలు (07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఇది మల్కాజిగిరి, నల్గండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.










