తిరుపతి : హోటల్‌లో అక్కా తమ్ముడు హత్యకు గురైన ఘటన తిరుపతి కపిలతీర్థం సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్ కుటుంబసమేతంగా వేంకటేశ్వరుడి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ హౌటల్‌లో అద్దెకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన భార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అక్కడి నుండి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో లంగిపోయాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










