- సన్‌రైజర్స్‌పై 34 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపు
భువనేశ్వర్‌కు ఐదు వికెట్లు అహ్మదాబాద్: గుజరాత్ జట్టు సన్‌రైజర్స్‌పైన గెలిచి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తొలుత గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి తోడు సాయి సుదర్శన్(47) మెరవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో సన్‌రైజర్స్ జట్టు 9వికెట్ల నష్టానికి 154పరుగులే చేసింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టు 34పరుగుల తేడాతో పట్టికలో 18పాయింట్ల నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. సెంచరీ హీరో శుభ్ మాన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47) సన్ రైజర్స్ బౌలింగ్‌లో వీరవిహారం చేశారు. అద్భుతంగా ఆడిన గిల్ 58 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు వికెట్ నష్టానికి 147 పరుగులు చేసింది. అక్కడ్నించి సన్ రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ గుజరాత్ టైటాన్స్‌కు కళ్లెం వేశారు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి గుజరాత్ చివరి 6 ఓవర్లలో 41 పరుగులు చేసి ఏకంగా 8 వికెట్లు చేజార్చుకుంది. చివరి ఓవర్లో నాలుగు వికెట్లు పతనం కాగా, అందులో మూడు భువనేశ్వర్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద భువనేశ్వర్ కుమార్ ఈ ఇన్నింగ్స్‌లో 5వికెట్లు తీయడం విశేషం. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3) నిరాశపరిచారు. ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ డకౌట్ అయ్యారు. జాన్సెన్, ఫజల్ హక్ ఫరూఖీ, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు. ఛేదనలో సన్‌రైజర్స్ జట్టు 59పరుగులకే 7వికెట్లు కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ తర్వాత క్లాసెన్(64) అర్ధసెంచరీకి తోడు భువనేశ్వర్ కుమార్ (27) కలిసి 8వ వికెట్‌కు 68పరుగులు జతచేశారు. వీరిద్దరి నిష్క్రమణతో సన్‌రైజర్స్ ఓటమి పరిపూర్ణమైంది. షమీ, మోహిత్ శర్మకు నాలుగేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్‌మన్ గిల్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి)అభిషేక్ శర్మ (బి)భువనేశ్వర్ 0, శుభ్‌మన్ (సి)సమద్ (బి)భువనేశ్వర్ 101, సుదర్శన్ (సి)నటరాజన్ (బి)జెన్సన్ 47, హార్దిక్ (సి)త్రిపాఠి (బి)భువనేశ్వర్ 8, మిల్లర్ (సి)మార్‌క్రమ్ (బి)నటరాజన్ 7, తెవాటియా (సి)జెన్సన్ (బి)ఫరూఖీ 3, శనక (నాటౌట్) 9, రషీద్ ఖాన్ (సి)క్లాసెన్ (బి)భువనేశ్వర్ 0, నూర్ అహ్మద్ (రనౌట్) క్లాసెన్/భువనేశ్వర్ 0, షమీ (సి)జెన్సన్ (బి)భువనేశ్వర్ 0, మోహిత్ శర్మ (నాటౌట్) 0, అదనం 13. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 188పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/147, 3/156, 4/169, 5/175, 6/186, 7/186, 8/186, 9/187
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-30-5, జెన్సన్ 4-0-39-1, ఫరూఖీ 3-0-31-1, నటరాజన్ 4-0-34-1, మార్‌క్రమ్ 1-0-13-0, మార్కండే 3-0-27-0, అభిషేక్ శర్మ 1-0-13-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : అన్మోల్‌ప్రీత్ సింగ్ (సి)రషీద్ (బి)షమీ 5, అభిషేక్ శర్మ (సి)సాహా (బి)యశ్ దయాల్ 4, మార్‌క్రమ్ (సి)శనక (బి)షమీ 10, త్రిపాఠి (సి)తెవాటియా (బి)షమీ 1, క్లాసెన్ (సి)మిల్లర్ (బి)షమీ 64, సన్వీర్ సింగ్ (సి)సాయి సుదర్శన్ (బి)మోహిత్ శర్మ 7, అబ్దుల్ సమద్ (సి)శివమ్ మావి (బి)మోహిత్ శర్మ 4, జాన్సెన్ (సి)హార్దిక్ (బి)మోహిత్ శర్మ 3, భువనేశ్వర్ కుమార్ (సి)రషీద్ ఖాన్ (బి)మోహిత్ శర్మ 27, మార్ఖండే (నాటౌట్) 18, ఫరూఖీ (నాటౌట్) 1, (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 154పరుగులు. వికెట్ల పతనం: 1/6, 2/11, 3/12, 4/29, 5/45, 6/49, 7/59, 8/127, 9/147
బౌలింగ్:షమీ 4-0-20-4, యశ్ దయాల్ 4-0-31-1, రషీద్ ఖాన్ 4-0-28-0, మోహిత్ శర్మ 4-0-24-4, నూర్ అహ్మద్ 2.5-0-35-0, తెవాటియా 1.1-0-7-0










