Sep 20,2023 21:02

పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై అభ్యంతరం తిరస్కరణ
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :కృష్ణా ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టిఎంసిల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 246పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎపి ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన ఇంటర్‌లకేటరీ అప్లికేషన్‌ను ట్రిబ్యునల్‌ బుధవారం విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌, సభ్యులు జస్టిస్‌ ఎస్‌ తలపాత్ర, జస్టిస్‌ రామ్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ కేసును కొట్టివేశారు. దీంతో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్‌ పరిశీలనలో సిడబ్ల్యుసికున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.