- ముంబయిపై ఆరు పరుగుల తేడాతో లక్నో గెలుపు
- ప్లే-ఆఫ్‌కు ఆశలు సజీవం
లక్నో: ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సత్తాచాటింది. ముంబయి ఇండియన్స్‌తో మంగళ వారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినీస్ విధ్వంస ఇన్నింగ్స్ తోడవ్వడం తో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 177పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు 10 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోయి 92పరుగులు చేసినా.. ఆ తర్వాత తడబాటుకు గురై నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 172పరుగులే చేసి ఓడింది. చివరి 6బంతుల్లో 11పరుగులు చేయాల్సిన ముంబయి జట్టు మొహిసిన్ ఖాన్ వేసిన ఓవర్లో కేవలం 5పరుగులే చేసింది. గ్రీన్ 4బంతులు ఎదుర్కొని 2పరుగులే చేయడం ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టాస్ ఓడిన లక్నోకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన దీపక్ హుడా(5) విఫలయ్యాడు. బెహ్రన్‌డార్ఫ్ ఒకే ఓవర్లో హుడా, ప్రేరక్ మన్కడ్(0)ను ఔట్ చేశాడు. క్వింటన్ డికాక్(16) కూడా తక్కువ పరుగులకే పెవీలియన్‌కు చేరిపోయాడు. దీంతో లక్నో జట్టు 35పరుగులకే టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో స్టొయినీస్ 47బంతుల్లో 4ఫోర్లు, 8సిక్సర్లతో 89పరుగులు, కృనాల్ పాండ్యా(49రిటైర్డ్ హార్ట్) 42బంతుల్లో ఫోర్, సిక్సర్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కు 78 పరుగులు జోడించారు. లక్నో జట్టు చివరి 4ఓవర్లలో 68పరుగులు చేసింది. బెహ్రెన్‌డార్ఫ్‌కు రెండు, పియూష్ చావ్లాకు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో ముంబయి జట్టుకు శుభారంభం దక్కింది. ఇషాన్ కిషన్(59), రోహిత్ శర్మ(37) కలిసి తొలి వికెట్‌కు 9.1 ఓవర్లలో 90పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత టిమ్ డేవిడ్(32నాటౌట్; 19బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించాడు. బిష్ణోరు, యశ్ ఠాకూర్‌కు రెండేసి, మొహిసిన్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టొయినీస్‌కు లభించింది.










