Sep 20,2023 12:59

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని తుంపెర గ్రామంలోని ఎస్సీ కాలనీ కి వెళ్లే రోడ్డుపై మురుగునీరు నిలిచి అందులోనే కాలనీవాసులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... తుంపెర ఎస్సీ కాలనీలో సమస్య పరిష్కరించాలని బుధవారం ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారుల నుండి స్పందన వచ్చింది. ఎంపీడీవో దివాకర్‌ ఈరోజు ఉదయం గ్రామంలోని స్థానిక పంచాయతీ కార్యదర్శితో, స్థానికులతో మాట్లాడారు. రోడ్డుపై నిలిచిన మురుగునీటిని వెంటనే పక్కకు మళ్లించి కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించడంతో వెంటనే పనులు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించడానికి డ్రోజర్‌ అవసరమవుతుందని ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించి కాలనీవాసులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఎంపీడీవో తెలిపారు.