Oct 02,2023 21:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాస్త్రీయ దృక్పథాన్ని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైన్సుపై జరుగుతున్న దాడిని మేధావులు, విద్యావంతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు. అలాగే శాస్త్ర విజ్ఞానాన్ని రాష్ట్రంలో నలుమూలలా వ్యాప్తి చేయాలన్నారు. జెవివి సబ్‌కమిటీ కన్వీనర్లు ఇందుకు విశేష కృషి చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు 12 సబ్‌ కమిటీలకు కన్వీనర్లను ఈ సమావేశంలో ఎంపిక చేశారు. అంతర్గత విద్య కన్వీనర్‌గా కె త్రిమూర్తులు, జనవిజ్ఞానం కమిటీకి కె శ్రీనివాస్‌, చెకుముఖి కమిటీకి ఎస్‌ఎన్‌ రమేష్‌, పర్యావరణ కమిటీకి కెవివి సత్యనారాయణ, ఆరోగ్య కమిటీకి ఎఎస్‌ ప్రసాద్‌, ఉన్నత విద్య, వ్యవసాయం కమిటీలకు వైఎస్‌ నాగేశ్వరరావు, సోషల్‌ మీడియా, రికార్డు నిర్వహణ, ప్రెస్‌ కమిటీకి సిహెచ్‌ జయ ప్రకాష్‌, సాంస్కృతిక, మద్య, మాదకద్రవ్య వ్యతిరేక కమిటీకి కెఎమ్‌ఎమ్‌ఆర్‌ ప్రసాద్‌, సైన్సు కమ్యూనికేషన్‌ కమిటీకి పివి గోపాలరావు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిటీకి గొంటి గిరిధర్‌, పబ్లికేషన్‌ కమిటీకి దార్ల బుజ్జిబాబు, సమత కమిటీకి జి నిర్మల ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జెవివి ప్రధాన కార్యదర్శి కె రామారావు, పూర్వ అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌, మాజీ ప్రధాన కార్యదర్శులు గొంటి మురళీధర్‌, కె శ్రీనివాస్‌, ఎస్‌ఎన్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.