Feb 10,2023 22:06
  • అక్షర్‌ పటేల్‌, జడేజా అర్ధసెంచరీలు
  • ఆస్ట్రేలియాపై 144 పరుగుల ఆధిక్యత
  • బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీ

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డు సెంచరీకి తోడు ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్‌ 144పరుగుల ఆధిక్యతను సంపాదించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 77పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారతజట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 7వికెట్లు నష్టపోయి 321పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 66, అక్షర్‌ పటేల్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని దాదాపు 6 నెలల తర్వాత బరిలో దిగిన జడేజా బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్‌లోనూ అర్ధసెంచరీతో కదం తొక్కాడు. మెరిశాడు. 240 పరుగులకే 7వికెట్లు కోల్పోయిన భారత్‌ను జడేజా, అక్షర్‌ పటేల్‌ జోడీ ఆదుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్‌ మర్ఫీ 5, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 1, నాథన్‌ లైయన్‌ 1 వికెట్‌ తీశారు.

  • రోహిత్‌ రికార్డు సెంచరీ

టీమిండియా రోహిత్‌ శర్మ సెంచరీ కొట్టి కెప్టెన్‌గా మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా నాల్గో కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తరఫున కెప్టెన్‌గా మూడు ఫార్మాట్‌లలో సెంచరీ చేసి ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ప్రపంచకప్‌ క్రికెట్‌ చరిత్రలో తిలక్‌రత్నే దిల్షాన్‌(శ్రీలంక), డుప్లెసిస్‌(దక్షిణాఫ్రికా), బాబర్‌ అజామ్‌(పాకిస్తాన్‌)లు మాత్రమే మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్‌ హోదాలో సెంచరీలను చేశారు. తాజాగా రోహిత్‌ వారి సరసన చేరాడు. ఆస్ట్రేలియా మొత్తం 171బంతులను ఎదుర్కొన్న రోహిత్‌ 14ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో రోహిత్‌ ఓపెనర్‌గా ఆస్ట్రేలియాపై 21 ఇన్నింగ్స్‌లో 35ఏళ్ల రోహిత్‌ సెంచరీ కొట్టి టెస్టుల్లోనూ 3వేల మార్క్‌కు చేరాడు. అలాగే వ్యక్తిగతంగానూ టెస్టుల్లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

  • మర్ఫీకి ఐదు...

ఆసీస్‌ యువ స్పిన్నర్‌ మర్ఫీ ఆరంగేట్రం టెస్ట్‌లోనే ఐదు వికెట్లు సాధించాడు. స్పిన్‌కు అనుకూలించిన నాగ్‌పూర్‌ పిచ్‌పై మర్ఫి (5/82) అద్భుత స్పెల్‌తో అలరించాడు. టీమిండియా బ్యాటర్స్‌ రాహుల్‌, అశ్విన్‌, పూజారా, కోహ్లీ, శ్రీకర్‌ భరత్‌ వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లోనే 5వికెట్లు తీసిన ఆసీస్‌ నాలుగో ఆఫ్‌ స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డుల్లోకి ఎక్కాడు.

  • స్కోర్‌బోర్డు..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 177ఆలౌట్‌
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి)కమిన్స్‌ 120, కేఎల్‌ రాహుల్‌ (సి అండ్‌ బి) మర్ఫీ 20, అశ్విన్‌ (ఎల్‌బి)మర్ఫీ 23, పుజరా (సి)బోలండ్‌ (బి)మర్ఫీ 7, కోహ్లి (సి)క్యారీ (బి)మర్ఫీ 12 సూర్యకుమార్‌ (బి)ఎల్‌బి) 8, జడేజా (బ్యాటింగ్‌) 66, శ్రీకర్‌ భరత్‌ (ఎల్‌బి)మర్ఫీ 8, అక్షర్‌ పటేల్‌ (బ్యాటింగ్‌) 52, అదనం 5. (114ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 321పరుగులు.
వికెట్ల పతనం: 1/75, 2/118, 3/135, 4/151. 5/166, 6/229, 7/240
బౌలింగ్‌: కమిన్స్‌ 18-2-74-1, బోలండ్‌ 17-4-34-0, లియాన్‌ 37-10-98-1, మర్ఫీ 36-9-82-5, లబూషేన్‌ 5-0-24-0, రెన్‌షా 1|0-7-0