ఇంగ్లాండ్ : యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే, చివరి రోజు ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను ఉద్దేశించి ఇంగ్లాండ్ పేసర్ స్లెడ్జింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రాబిన్‌సన్ మాట్లాడుతూ.. గతంలో తమ జట్టుపైనా రికీ పాంటింగ్ సహా ఇతర ఆసీస్ ఆటగాళ్లు ఇలానే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలపై తాజాగా రికీ పాంటింగ్ స్పందించాడు. ''రాబిన్‌సన్ మాట్లాడిన తీరు సరికాదు. అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆసీస్‌తో ఇలాంటి ఇంగ్లాండ్ జట్టు ఆడలేదు. నాణ్యమైన ఆసీస్ జట్టుతో యాషెస్ క్రికెట్ అంటే ఏంటో వేగంగా అర్థం చేసుకోవాలి. గతవారమే రాబిన్‌సన్ నేర్చుకోలేకపోయాడు. అతడు కాస్త నెమ్మదిగా నేర్చుకుంటాడనుకుంటా. యాషెస్‌లో ఆసీస్ క్రికెటర్లతో మాట్లాడాలనుకుంటే.. ముందు నీ (రాబిన్‌సన్) బౌలింగ్ ప్రదర్శన మెరుగ్గా ఉండేలా చూసుకో.'' అని అన్నాడు.










