ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : లింగంపల్లి-విశాఖపట్నం, మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య రైళ్లను ఈ నెల 17 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 16న నడవాల్సిన విశాఖ, లింగంపల్లి రైలు 17న, 17న నడవాల్సిన లింగంపల్లి-విశాఖపట్నం రైలు 18న, 16న నడవాల్సిన మచిలీపట్నం-విశాఖపట్నం రైలు 17న, 17న నడవాల్సిన విశాఖపట్నం-మచిలీపట్నం రైలు 18న నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.










