Jun 25,2023 17:29

ఆసియా కప్‌ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రాతో పాటు పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ ఆఫ్రిదీ కూడా గాయపడ్డాడు. పూర్తి ఫిట్‌గా లేకపోయినా అతడు టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నీ ఆడాడు. కొన్ని రోజులకే గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్‌కి దూరమయ్యాడు. అప్పటి నుంచి వరుసగా గాయాలతో బాధపడుతూ టీమ్‌కి దూరంగా ఉంటున్నాడు.. ఈ క్రమంలో బుమ్రా గాయంపై రవిశాస్త్రి స్పందించాడు. 'జస్ప్రిత్‌ బుమ్రా, టీమిండియాకి చాలా ముఖ్యమైన ప్లేయర్‌. అయితే వరల్డ్‌ కప్‌ కోసం అతన్ని తొందరపడి ఆడిస్తే.. మొదటికే మోసం వస్తది. గాయం తిరగబెడితే మరో నాలుగు నెలల పాటు టీమ్‌కి దూరం అవుతాడు.. షాహీన్‌ ఆఫ్రిదీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి, టీమిండియా తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉండడానికి చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి.. జస్ప్రిత్‌ బుమ్రా లేకపోయినా టీమ్‌ని నడిపించేందుకు మనదగ్గర బౌలర్లు ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ.. టీమ్‌లో సీనియర్‌ ప్లేయర్లను రిప్లేస్‌ చేసేందుకు కావాల్సినంత మంది ప్లేయర్లు ఉన్నారు.. ' అంటూ కామెంట్‌ చేశాడు.