హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ భగ్నం చేసి.. 37 మందిని రాచకొండ పోలీసులు అదుపలోకి తీసుకున్నారు. వీరంతా బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 33 మంది విద్యార్థులతో పాటు.. విద్యార్థులకు గంజాయి సప్లై చేసినా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల రేవ్ పార్టీకి అనుమతించిన సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా గుర్తించారు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.










