Apr 11,2023 10:05

న్యూఢిల్లీ : భారత్‌లో ''సాధారణం కంటే తక్కువ'' రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనీ, ఎల్‌-నినో వచ్చే అవకాశం ఉందనీ, ఇది సాధారణంగా ఆసియాకు పొడి వాతావరణాన్ని తెస్తుందని ప్రయివేట్‌ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్‌ సోమవారం తెలిపింది. ''ఎల్‌ నినో సంభావ్యత పెరుగుతోంది . రుతుపవనాల సమయంలో దాని సంభావ్యత ఎక్కువగా పెరుగుతోంది. ఎల్‌ నినో తిరిగి బలహీనమైన రుతుపవనాలను సూచించవచ్చు,'' అని స్కైమెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జతిన్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94% ఉంటుందని స్కైమెట్‌ పేర్కొంది, ఉప-సమృద్ధి రుతుపవనాల మునుపటి వీక్షణను అలాగే ఉంచింది. జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగు నెలల సీజన్‌లో 50 సంవత్సరాల సగటు 88 సెంటీమీటర్ల (35 అంగుళాలు)లో 96% , 104% మధ్య సగటు లేదా సాధారణ వర్షపాతం ఉండొచ్చని అంచనావేసింది.
         ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత వాతావరణ శాఖ తన వార్షిక రుతుపవనాల సూచనను త్వరలో ప్రకటించనుంది. నీటిపారుదల సౌకర్యం లేని భారతదేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమి వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి , సోయాబీన్స్‌ వంటి పంటలను పండించడం జూన్‌-సెప్టెంబర్‌ వర్షాలపై ఆధారపడి ఉంటుంది.
         దేశంలోని ఉత్తర , మధ్య ప్రాంతాలు వర్షాభావానికి గురయ్యే ప్రమాదం ఉందని స్కైమెట్‌ అంచనా వేసింది. ఉత్తర భారత వ్యవసాయ క్షేత్రంగా పేరొందిన పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ , ఉత్తరప్రదేశ్‌లలో సీజన్‌ 2వ సగభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
      ఈలోపు అకాల వర్షాలు , వడగళ్ల వానలు పడ్డాయని తెలిపింది. భారతదేశం యొక్క సారవంతమైన ఉత్తర, మధ్య , పశ్చిమ మైదానాలలో గోధుమ వంటి పంటలను ఇవి దెబ్బతీశాయి, వాతావరణ సమతుల్యత లేకపోవటంతో.. వేలాది మంది రైతులు నష్టాలకు గురికావడం , ఆహార ధరల ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని స్కైమెట్‌ రిపోర్టులో ప్రస్తావించింది.