Oct 19,2023 11:01

భూపాలపల్లి : రాహుల్‌ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది. కేటీకే 5వ గని నుంచి బాంబుల గడ్డ వరకు రాహుల్‌ గాంధీ నిరుద్యోగులతో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జెన్‌ కో అతిథి గృహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. బైక్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి, ఉత్తమ్‌, మధుయాష్కీ పాల్గొన్నారు. పోలీసులు ములుగు నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే వాహనాల దారిని మళ్లిస్తున్నారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో రాహుల్‌ స్థానికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసేపట్లో కాటారంలో రైతులతో రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు.