Oct 16,2023 16:16

హైదరాబాద్‌ : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ జనగాంలోని మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సభలోనే కేసీఆర్‌ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు.కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత అయిన పొన్నాల లక్ష్మయ్య జనగాం టికెట్‌ ఆశించారు. పొన్నాలకు టికెట్‌ దక్కే అవకాశం లేకపోవడంతో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.