Sep 25,2023 09:47

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ... సిఐటియు , ఏఐటియుసి, ఐఎఫ్‌టియు మూడు సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన 'చలో విజయవాడ' పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ ధర్నా చౌక వద్ద అంగన్వాడీలు నేడు సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో .... పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో కొంతమంది అంగన్వాడీలు మారువేషాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. విజయవాడ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వద్ద పోలీసులు నెట్టివేయడంతో ఓ అంగన్వాడీ సొమ్మసిల్లిపోయారు. పోలీసులు దిగ్బంధనాలను దాటుకుంటూ తాము నిరసన చేపడతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

police-supress-on-anganwadi-chalo-vijayawada

 

 tpt-anganwadi-chalo-vijayawada-protest

తిరుపతి : విజయవాడ నగరంలో అంగన్వాడి మహిళలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్ టియుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం చేపట్టాయి. సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని, ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనలేదని హెచ్చరించారు.  సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కందారపు మురళి, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

 

kakinada-police-suppress-on-anganwadi-chalo-vijayawada1
  • పోలీసుల జులం

- కాకినాడలో అంగన్వాడీ, సిఐటియు నాయకుల అక్రమ అరెస్టులు
- మహిళా సిబ్బంది కరువు 

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాంతియుతంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయడానికి వెళుతున్న అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేశారు.విజయవాడ వెళ్ళనీయకుండా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో నిర్బంధించి అక్రమ అరెస్టులకు పాల్పడి స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను నిరసిస్తూ సోమవారం కాకినాడ సుందరయ్య భవన్ వద్దకు చేరుకున్న పలువురు అంగన్వాడి వర్కర్లు, సిఐటియు నాయకులపై పోలీసులు జులం ప్రదర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తూ కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేశారు. మహిళా పోలీస్ సిబ్బంది లేకుండానే మగ పోలీసులే అంగన్వాడీలను అడ్డుకుని అతి ప్రదర్శించారు.
సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణలను బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి జీపులు ఎక్కించి 2 టౌన్,3 టౌన్ స్టేషన్లకు తరలించారు. ఆరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కోరుతూ అంగన్వాడీలు జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ గౌరవ వేతనం స్థానంలో కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, అప్పటివరకు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు చెల్లిస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేయాలని డిమాండ్ చేసారు. సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టిన టిఏ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్ గా గుర్తించాలని డిమాండ్ చేసారు. 

సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాలరాస్తుందని విమర్శించారు. ప్రజా ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ చట్టాన్ని సైతం దిక్కరించి పోలీస్ యంత్రాంగం మహిళలను కూడా చూడకుండా రాత్రి 8 గంటల వరకు సామర్లకోట పోలీస్ స్టేషన్లో అంగన్వాడీలను నిర్బంధించడాన్ని తప్పుపట్టారు. టికెట్లు కొనుగోలు చేసి విజయవాడ ప్రయాణిస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడాలని సూచించారు. నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు పెంచుతున్న జగన్ ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు పెంచాలని తెలియాదా అని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలపై జగన్ నిర్బంధానికి వ్యతిరేకంగా, కార్మిక, ఉద్యోగ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.ఈ ధర్నాకు ముందు నుంచే విజయవాడకు పర్మిషన్ లేదని వచ్చిన వారందరిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు నాయకులు కార్యకర్తలను బెదిరించారు. జిల్లా వ్యాప్తంగా సిఐటియు జిల్లా, స్థానిక నాయకత్వాన్ని, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులను గృహనిబంధాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. అయినా అంగన్వాడీలందరూ ముందు రోజు నుండే జిల్లా నుండి వందల సంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు.

 

visakha-police-suppress-on-anganwadi-chalo-vijayawada
  • అంగన్వాడీలపై పోలీసుల నిర్బందకాండ

విశాఖలో 200 మంది అరెస్ట్
ప్రజాశక్తి-కలెక్టరేట్ : అంగన్వాడీలపై పోలీసులు నిర్బంధకాండను ప్రయోగించారు. అంగన్వాడీల ఆందోళన పై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం నిరసిస్తూ, సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన తెలిపేందుకు వచ్చిన అంగన్వాడీలను, పోలీసులు నిరోధించారు. పోలీసులు చర్యను నిరసిస్తూ, అంగన్వాడీ కార్యకర్తలు గాంధీ విగ్రహానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు వచ్చిన వారిని,వచ్చినట్లే లాక్కొని వెళ్లి వేన్లలో ఎక్కించి,అరెస్టులు సాగించారు.సుమారు 200 మందిని అరెస్టు చేసి, పోలీస్ బ్యారెక్స్ కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె. ఎస్.వి కుమార్, యూనియన్ గౌరవ సలహాదారు కె. బృందావతి,జిల్లా అధ్యక్షురాలు బి.తులసి, కార్యదర్శి ఎల్.దేవి, కోశాధికారి కె.పద్మావతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. శోభారాణి,నాయకులు బి. ఈశ్వరమ్మ,ఎల్.ఆదిలక్ష్మి, పాప వేణి,ఆర్.ఈశ్వరమ్మ, బి.భవాని,ఎ.సత్య,ఆర్. నాగేశ్వరి,ఎం.వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.

  • అంగన్‌వాడీల ఆందోళనపై ప్రభుత్వ నిర్భంధాన్ని ఆపాలి : అక్రమ అరెస్టులను ఖండించిన సిఐటియు

ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్,యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి. మణి మాట్లాడుతూ
అంగన్‌వాడీలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని చేపట్టిన సెప్టెంబరు 25 చలో విజయవాడ కార్యక్రమంపై  జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు.అడుగుడున గృహానిర్భంధాలు, అరెస్టులు చేయడం,  రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలియజేసే హక్కును కాలారాయడం,  శాంతియుతంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చిన కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడం,అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్బంధం ఎంత ప్రయోగించినా, అంగన్‌వాడీల పోరాటం ఆపేది లేదని, న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంగన్వాడీలకు సకాలంలో వేతనాలు,బిల్లులు చెల్లించడం లేదన్నారు. తెలంగాణా కన్నా అదనంగా రూ.1000 వేతనాలు పెంచుతామని సిఎం హామి ఇచ్చారన్నారు. తెలంగాణాలో 2021 నుండీ వర్కర్లకు రూ.13,650, హెల్పర్లకు, మినీలకు రూ.7,800 ఇస్తున్నారన్నారు. తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రిగారి హామీ నీటి మీద రాతగా మిగిలిందన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యూటి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను అమలుచేయాలని కోరినా,రాష్ట్రప్రభుత్వం స్పందించడంలేదనచన్నారు.రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారన్నారు.సమస్యలు పరిష్కారం చెయ్యాలని ప్రాజెక్టు,జిల్లాలలో అంగన్వాడీలు ఆందోళన చేసినా,ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రాలేదని ఆరోపించారు.ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  విజయవాడ అలంకార్‌ సెంటర్ లో ధర్నా చేయాలని, రాష్ట్ర కమిటి పిలుపును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేస్తోందన్నారు. ఉద్యమాలని అణిచివేసిన ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామ్యం దేశంలో కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తుచేశారు.ఇప్పటికైనా మాటతప్పని ముఖ్యమంత్రి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

wg-police-suppress-on-anganwadi-chalo-vijayawada1
  • నిర్బంధించడం అప్రజాస్వామ్యం

ప్రజాశక్తి - పెనుమంట్ర(పగో) :అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలపై నిరసన చేయడం వలన వారిని నిర్బంధించడం అప్రజాస్వామ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ అన్నారు. విజయవాడలో జరిగే అంగన్వాడి ధర్నాకు వెళ్ళకుండా పోలీస్ స్టేషన్ లో సోమవారం అంగన్వాడీలను నిర్బంధించారు .ఈ సందర్భంగా అంగన్వాడీలకు గోపాలన్ పరామర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సమస్యలను ఉద్దేశించి గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు రూ 1000 ఆదనంగా ఇస్తానని హామీ నెరవేర్చాలన్నారు.అంగన్వాడీలకు కేవలం రూ11వేల 500 ఇచ్చి అదనపు భారాన్ని చేయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను తమ సమస్యలపై నిరసన చేసేందుకు వెళుతున్న వారిని పోలీసులతో నిర్బంధించడం అప్రజాస్వామ్యమని అన్నారు. స్టేషన్ లో మండలం పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.

 

పోటో: సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్వాడీలు
సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్వాడీలు
  • అరెస్టు నిరసిస్తూ అంగన్వాడీలు బైటాయింపు

ప్రజాశక్తి ఆదోని(కర్నూల్): ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను పరిష్కరించాలని చలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వీరన్న, పద్మ, గోపాల్, మహానంది రెడ్డి, తిప్పన తెలిపారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు .ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు నెలకు రూ 26000 వేతనం ఇవ్వాలన్నారు. పని భారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పర్మినెంట్ చేయాలని కోరుతున్న సీఎం జగన్ పట్టించుకోవడం లేదన్నారు. సీఎంకు వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేసి పరిపాలన అధికారి కి వినతి పత్రం ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి అంగన్వాడి నాయకురాలు లలిత కుమారి మాలమ్మ తదితరులు ఉన్నారు.

 

అంగన్వాడీల అరెస్ట్ ప్రజాశక్తి.. వన్ టౌన్  నగరంలోని ధర్నా చౌక్ కు వెళ్తున్న అంగన్ వాడి లను రైల్వే స్టేషన్, బస్టాండు, కనక దుర్గ నగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు 140 మంది, భవనిపురం కు 60 మంది, టూ టౌన్ కు 20 మంది అంగన్వాడీ లను అరెస్ట్ చేసి తరలించారు.
  • అంగన్వాడీల అరెస్ట్

ప్రజాశక్తి-వన్ టౌన్ : విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ కు వెళ్తున్న అంగన్ వాడిలను రైల్వే స్టేషన్, బస్టాండు, కనక దుర్గ నగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు 140 మంది, భవనిపురం కు 60 మంది, టూ టౌన్ కు 20 మంది అంగన్వాడీ లను అరెస్ట్ చేసి తరలించారు.

 

అంగన్వాడీ లపై నిరంకుశ వైఖరి విడనాడాలి - సీఐటీయూ  రాజంపేట అర్బన్
  • అంగన్వాడీ లపై నిరంకుశ వైఖరి విడనాడాలి : సీఐటీయూ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై నిరంకుశ వైఖరిని విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ అన్నారు. హక్కుల సాధన కోసం అంగన్వాడి కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ  కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సి.రవికుమార్ మాట్లాడుతూ హక్కుల సాధన కోసం విజయవాడకు వెళుతున్న అంగన్వాడీ మహిళలను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేసి, నోటీసులు ఇచ్చి మహిళలన్న కరుణ కూడా లేకుండా వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు మంచి చర్య కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హామీల అమలు కోసం ప్రజాస్వామ్య బద్ధంగా తాము నిర్వహించ తలపెట్టిన ధర్నాను సైతం అధికార బలంతో అడ్డుకోవడం దారుణమని తెలిపారు. గత ప్రభుత్వాలలో తాము ఎన్నో పోరాటాలు నిర్వహించాము కానీ తమపై ఇంతటి నిరంకుశ వైఖరిని ఏ ప్రభుత్వము చూపలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎం.ఈశ్వరమ్మ, ఎం.విజయమ్మ, శివరంజని, అమరావతి, ఇందిరమ్మ, సునీత, వనిత, ఇంద్రావతి, మమత, అనురాధ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

 

కంచికచర్ల... అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ

కంచికచర్ల(ఎన్టీఆర్ జిల్లా) : అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలింపు. అంగన్వాడీ సిబ్బందితో పాటు మధ్యాహ్న భోజన పధకం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

 

konaseema-police-suppress-on-anganwadi-chalo-vijayawada
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అక్రమ అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్ వద్ద అంగన్వాడిలు ధర్నా
  • అక్రమ అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్ వద్ద అంగన్వాడిలు ధర్నా

ప్రజాశక్తి-అమలాపురం : తమ న్యాయమైన కోరికలు సాధన కొరకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న  అంగన్వాడీలను అక్రమ అరెస్టులకు నిరసనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఉపాధ్యాయ సంఘాలు సిపిఎం ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు.

 

జిల్లా కలెక్టరేట్ వద్ద బైటాయింపు
విజయనగరం టౌన్ 
  • ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం

- జిల్లా కలెక్టరేట్ వద్ద బైటాయింపు

- రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ను అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఇన్ గేటు వద్ద బైటాయించారు. అంగన్వాడీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా వేతనాలు పెంచాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం కోసం, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సే యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్,నాయకులు టివి రమణ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

satyasai-police-suppress-on-anganwadi-chalo-vijayawada
  • డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి :  సిఐటియు నాయకులు                          

ప్రజాశక్తి-బత్తలపల్లి(సత్యసాయి జిల్లా) : నేటి జీవన విధానానికి అనుకూలంగా తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని  జిల్లా సి ఐ టి యు శ్రామిక మహిళా కన్వీనర్ నాయకురాలు దిల్షాద్ డిమాండ్ చేశారు సోమవారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు ముందు అంగన్వాడీ వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు గర్భవతులు బాలింతలకు ఎన్నో సేవలు అందిస్తున్నామని అయినా తాము పడుతున్న అవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విధంగా వేతనాలు పెంచడం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెంచిన పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాన్ని 26 వేల వరకు పెంచడం చేయాలన్నారు. తమ న్యాయమైన కోరికల కోసం ఎన్నో ఏళ్లగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అనంతరం సూపర్వైజర్లకు  వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలం సిఐటియు నాయకులు వాసంతి, వసంత, ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.