Oct 17,2023 09:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై డాక్టర్లు, జైలు అధికారులు, వైసిపి నాయకులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండటంతో తమకు చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ కాపీ ఇవ్వాలని విజయవాడలోని ఎసిబి కోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాదులు ఈ మేరకు ఎసిబి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్టు ఇవ్వటం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతానని ఎసిబి కోర్టు న్యాయమూర్తి తెలిపారు.