ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : పెనుమంట్ర పోలీస్ స్టేషన్ లో హెచ్ సి 124 గా పనిచేస్తున్న ప్రసాద్ (52) అనారోగ్యంతో బాధపడుతూ భీమవరం ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈయనకు భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల కాలంలో లివర్ కి సంబంధించి ప్రసాద్ అనారోగ్యానికి గురికావడంతో భీమవరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈయన స్వగ్రామం వేండ్ర , 1998 బ్యాచ్ కు చెందినవారు. వారి కుటుంబ సభ్యులకు ఎస్సై బి.సురేంద్ర కుమార్, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు.