Sep 17,2023 11:10

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వారం రోజుల నుండి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో బాధిత బాలిక (13) అన్నయ్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని క్యాంటిన్‌లో పని చేస్తున్న యువకుడు బాలికపై కన్నేశాడు. గతరాత్రి బాలిక లిప్ట్‌లో వెళ్తుండగా.. ఆమెను అడ్డుకున్నాడు. ఆ తర్వాతపై అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న బాధిత బాలిక తనపై జరిగిన దారుణాన్ని ఆస్పత్రి సిబ్బందికి బాధితురాలు తెలియజేసింది. అనంతరం బాధితురాలు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.