Jun 27,2023 15:56

బెంగళూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ఏన్సీఏలో శిక్షణ పొందుతున్న తన సహచర ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌ను పంత్‌ కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను పంత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌చేశాడు. మా గ్యాంగ్‌తో రీయూనియన్‌ కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ పంత్‌ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా జోడించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కెఎల్‌ రాహల్‌ కూడా గత కొన్ని రోజుల నుంచి ఏన్సీఏలోనే శిక్షణ పొందుతున్నాడు. తన మోకాలి సర్జరీ తర్వాత రాహుల్‌ ఏన్సీఏలో చేరిన విషయం తెలిసిందే.