Jan 28,2023 21:00

ముంబయి : తాము రెండు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నట్లు మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ పిజిఐఎం ఇండియా తెలిపింది. అంతర్జాతీయ, ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రూడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి నిర్వహణ వ్యాపారమైన పిజిఐఎం కొత్త వ్యాపారాల కోసం భారతీయ అనుబంధ సంస్థకు అదనపు దీర్ఘకాలిక పెట్టుబడి సమకూర్చడానికి అంగీకరించినట్లు పేర్కొంది. నియంత్రణ ఆమోదాలకు లోబడి 2023 ఏప్రిల్‌ 1న రెండు కొత్త వ్యాపారాల ప్రారంభించనున్నామని పిజిఐఎం ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆసియా వైస్‌ ఛైర్మన్‌ డేవిడ్‌ ఛాంగ్‌ తెలిపారు. ''భారతదేశంలోని అధిక నికర విలువ, రిటైల్‌ మార్కెట్లలో సంపద ఉత్పత్తి. దేశంలో ఆఫ్‌షోర్‌ పెట్టుబడుల ద్వారా పెరుగుతున్న అవకాశాలను మేము గమనిస్తున్నాం. గత కొద్ది సంవత్సరాల్లో పిజిఐఎం ఇండియా గణనీయమైన వఅద్ధిని సాధించింది. అనుభవ సంపద, నిరూపితమైన మా స్థానిక నాయకత్వం పనితీరు మరియు పెట్టుబడి నైపుణ్యాలు తదుపరి దశ వృద్థిపై మాకు అపారమైన విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి'' అని డేవిడ్‌ ఛాంగ్‌ పేర్కొన్నారు. ''మా మ్యూచువల్‌ ఫండ్‌ క్లయింట్ల అత్యద్భుతమైన మద్దతుకు మేము ఎంతో సంతోషిస్తున్నాను, ఒక సమర్థవంతమైన పెట్టుబడి బఅందాన్ని సమకూర్చుకొని, విస్తఅతమైన కేంద్రీకరణతో కూడిన పిజిఐఎం ఇండియా 2.0ను ప్రారంభించడానికి అది మమ్మల్ని ప్రోత్సహించింది.'' అని పిజిఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సిఐఒ శ్రీనివాసరావు రావూరి పేర్కొన్నారు.