Sep 23,2023 09:02

పేర్నమిట్ట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని, జిల్లా అభివృద్ధికి రూ.10 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ... సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి ప్రారంభమైన సిపిఐ(ఎం) పోరుబాట పాదయాత్ర శనివారంతో 14వ రోజు పేర్నమిట్ట నుండి కొనసాగుతోంది. పేర్నమిట్టలో కమ్యూనిస్టు నాయకులు నూకతోటి కోటయ్య స్థూపానికి, మిడసల వెంకట సుబ్బయ్య విగ్రహానికి సిపియం పాదయాత్ర బఅందం పూలమాలలు వేసి నివాళులర్పించింది. పాదయాత్ర బృందంతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నడిచారు.