May 12,2023 22:07

సెమీస్‌లో ఓడిన నిషాంత్‌, దీపక్‌, హుసాముద్దీన్‌
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

తస్కెంట్‌(ఉజ్బెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరిన ముగ్గురు బాక్సర్లు కాంస్య పతకాలకే పరిమితమయ్యారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నిషాంత్‌ దేవ్‌, దీపక్‌ భోరియా, మహ్మద్‌ హుసాముద్దీన్‌ ఓటమిపాలయ్యారు. 48-51కిలోల విభాగంలో దీపక్‌ భోరియా, 54-57కిలోల విభాగంలో మహ్మద్‌ హుసాముద్దీన్‌, 67-71కిలోల విభాగంలో నిషాంత్‌ దేవ్‌ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. నిషాంత్‌ దేవ్‌.. కజకిస్తాన్‌కు చెందిన సింబర్జెనోవ్‌ చేతిలో, దీపక్‌ భోరియా.. ఫ్రాన్స్‌కు చెందిన బిలాల్‌ బెన్నామా చేతిలో పోరాడి ఓడగా.. మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ క్యూడాకు చెందిన రోడ్రిగేజ్‌ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఒకేసారి మూడు పతకాలు దక్కడం ఇదే తొలిసారి.