ప్రేమికులకు రోజు వద్దు -బ్లాక్ డేనే ముద్దు : కళాశాల విద్యార్థుల నిరసన
ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్య) : ' ప్రేమికుల రోజు వద్దు - బ్లాక్ డే నే ముద్దు ' అంటూ యువత నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు. కలకడ మండల కేంద్రమైన కలకడ ఎస్‌వి డిగ్రీ కళాశాల వద్ద ప్రేమికుల రోజుకు కళాశాల విద్యార్థులు స్వస్తి పలికారు. దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను సైతం అర్పించి దేశాన్ని కాపాడిన రోజును బ్లాక్ డేగా దేశం ప్రకటించిందని, ఈ క్రమంలో 2019 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన దేశ రక్షణలో భాగంగా దేశాన్ని కాపాడటం కోసం 43 మంది తమ ప్రాణాలను అర్పించి దేశాన్ని కాపాడిన సంఘటన మరుపురానిది, మరువలేనిది అని అన్నారు. కళాశాల విద్యార్థులు నల్లని దుస్తులను ధరించి బ్లాక్ డేని ఘనంగా నిర్వహించుకున్నారు.










