సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ మిగిలిన టెస్టులకు దూరమయ్యాడు. గాయపడ్డ లియాన్‌కు విశ్రాంతినివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) భావించడమే అందుకు కారణం. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి రానున్నాడు. భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మర్ఫీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ ఆఫ్ స్పిన్నర్ ఇంగ్లండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఆసీస్ తరఫున వందో టెస్టు ఆడుతున్న లియాన్ లార్డ్స్ టెస్టులో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. కుడి కాలికి దెబ్బ తగలడంతో మైదానం వీడిన అతను మూడో రోజు బౌలింగ్ చేయలేదు. స్కానింగ్ అనంతరం కర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. ఇక ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-0 ఆధిక్యలో ఉంది.,










