హైదరాబాద్ : హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది. అయితే తనను అరెస్టు చేయవద్దు అంటూ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడు రాంచంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ కొన్నట్లు నార్కోటిక్ బ్యూరో చెబుతున్నది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నవదీప్ మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు.










