Sep 25,2023 11:46

అన్నవరం (కాకినాడ) : కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి ... ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనేశ్వరి, కుటుంబసభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. వారితో పాటు టిడిపి సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప, మరికొందరులు ముఖ్యనేతలు ఉన్నారు.