ప్రత్తిపాడు (గుంటూరు) : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎన్‌ఐఏ అధికారులు సోమవారం తెల్లవారుజాము నుండి సోదాలు చేపట్టారు. ప్రజా సంఘాల నాయకుడు తమల పాకుల సుబ్బారావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్‌ఐఏ బఅందం హైదరాబాద్ నుండి తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ... సాధారణ తనిఖీలు అని స్థానిక పోలీస్ అధికారులు చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.










