Oct 18,2023 10:08

- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ప్రజాశక్తి-అమరావతి:విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన కోడికత్తితో దాడి కేసులో విశాఖలోని ఎన్‌ఐఎ కోర్టు విచారణను ఎనిమిది వారాలపాటు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న తమ పిటిషన్‌ను విజయవాడ ఎన్‌ఐఎ కోర్టు కొట్టేయడాన్ని ఆ కేసులో బాధితుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.